గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పోస్ట్‌, జోనల్ ఆప్షన్స్‌ కు అవకాశం

గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులకు నేటి నుంచి ఏపీపీఎస్సీ మంచి అవకాశం కల్పించింది. గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు వారి జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది.అభ్యర్థులకు జోన్, జిల్లాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 4 నుంచి 10వ తేదీ వరకు వాటిని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. మహిళలకు కేటాయించిన పోస్టులకు తగినంత మహిళా అభ్యర్థులు లేకపోతే, ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయిస్తారని తెలుస్తుంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.