వింత సమస్యతో బాధపడుతోన్న లైలా.. షాకవుతోన్న అభిమానులు

సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజి బిజీగా ఉంటోంది అలనాటి అందాల తార లైలా. 2022లో కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది విజయ్ ది గోట్ సినిమాలో నటించి మెప్పించింది. ఇటీవల విడుదలైన ఆది పినిశెట్టి సినిమా శబ్ధంలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది లైలా. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. లైలా పాత్ర కు కూడా ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తనకున్న వింత ఆరోగ్య సమస్య గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేంటంటే.. ఈ భామ నవ్వకుండా అసలు ఉండలేదట. ఒకవేళ నవ్వు ఆపేస్తే ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయట. అందుకే ఈ బ్యూటీ దాదాపు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట.


కాగా లైలాకున్న వింత సమస్యను గమనించిన విక్రమ్ శివపుత్రుడు సినిమా షూటింగ్ స్పాట్‌లో ఒక ఛాలెంజ్ విసిరాడట. కనీసం ఒక్క నిమిషం కూడా నవ్వకుండా ఉండాలని లైలాతో బెట్ కట్టాడట. అయితే లైలా 30 సెకన్లలోనే ఏడవడం మొదలుపెట్టిందట. దీంతో ఆమె షూటింగ్‌ కోసం వేసుకున్న మేకప్ మొత్తం కరిగి పోయిందట. దీనికి కారణం లైలా నవ్వు ఆపేస్తే ఆటో మెటిక్ గా కన్నీళ్లు వస్తాయట.అంటే తనకు తెలియకుండానే ఆమె ఏడ్చేస్తుందట. ఇది విని ఇప్పుడు అభిమానులు షాక్ అవుతున్నారు.