మార్కెట్‌లోకి మామిడి పండ్లు.. కిలో ఎంతో తెలుసా

గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరు అందుకుంటుందని వ్యాపారులు అంటున్నారు.అయితే ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు బాగా కురవడంతో మామిడి చెట్లకు నష్టం బాగా జరిగిందని.. అనుకున్న స్థాయిలో పంట రాలేదని రైతులు అంటున్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని అంటున్నారు. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి దాదాపు 2 వేల టన్నుల మామిడి మార్కెట్‌కు దిగుమతి కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 4 వేల టన్నుల వరకు వచ్చింది. మార్చి రెండు, మూడో వారానికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి పండ్లు మార్కెట్‌కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్ అధికారులు మామిడి సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.