Study tips: చదివింది స్కాన్ చేసినట్టుగా గుర్తుండాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్

పరీక్షలకు సమయం మించిపోతోంది. కానీ చదవాల్సిందేమో కొండంత ఉంది. ఇంత తక్కువ సమయంలో ఏం చదువుతాం అని మొత్తానికే ప్రిపరేషన్ ను అటకెక్కించేయకండి. మీకున్న తక్కువ సమయాన్ని కూడా ఎఫెక్టివ్ గా వాడుకోవడం మీకు తెలిస్తే మీరు కూడా టాపర్ గా మారొచ్చు. అయితే అందుకు కొంచెం క్రియేటివిటీకి పనిచెప్పాల్సి ఉంటుంది. మూస ధోరణిలో చదివే పద్ధతికి స్వస్తి పలికి పుస్తకాన్ని సరికొత్త కోణంలో చూడగలగాలి. ఇక్కడున్న టిప్స్ మీకు ఈ విషయంలో కచ్చితంగా హెల్ప్ అవుతాయి.


విద్యార్థి దశలో ఉన్న ప్రతి ఒక్కరికీ తమ బ్రెయిన్ మెమరీని పెంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీరెంత కష్టపడి చదివినా అది పరీక్షలో గుర్తురాకపోతే ఏం లాభం. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ ఉపయోగించి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే మీరు గుర్తుంచుకునే కెపాసిటీ పెరుగుతుంది. అంతేకాదు.. ఇది పరీక్షల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు మీకు సాయపడుతుంది. మరి ఈ క్రియేటివ్ మార్గాలేంటో మీరూ చదివేయండి.

పాఠాలను కథలుగా మార్చండి..
మీ మెదడుకు కథలంటే ఇష్టమని మీకు తెలుసా. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు కథలు చెప్పమని పేరెంట్స్ దగ్గర మారాం చేస్తుంటారు. అందుకే మీ స్టడీస్ కోసం ఈ బ్రెయిన్ హ్యాక్స్ ను ఉపయోగించుకోవడం మిమ్మల్ని తెలివైన వారిగా మారుస్తుంది. పాఠాలను కథల రూపంలో ఊహించుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. ఇలా చదవగలిగితే మీరసలు మర్చిపోయే అవకాశమే ఉండదు. పరీక్షల్లోనూ ఆ కథను ఒక్కసారి గుర్తుచేసుకున్నా మొత్తం సమాధానం మీ బుర్రలో గిర్రున తిరుగుతుంటుంది.

మెమరీ ప్యాలెస్ టెక్నిక్..
మీ ఇంటిని ఒక పెద్ద భవనంగా ఊహించుకోండి. అందులో వేర్వేరు టాపిక్స్, చాప్టర్స్ ను ఒక్కో గదిలో ఉంచినట్టుగా మానసికంగా సవరించుకోండి. దీనినే మీ మెమరీ ప్యాలెస్ గా గుర్తుంచుకోండి. ఇందులో టాపిక్స్ ను ఇమేజెస్ ఆధారంగా సెపరేట్ చేయండి. ఈ టెక్నిక్ మీ మెమరీని మరింత స్పష్టంగా, బలంగా మారుస్తుంది.

మరొకరికి నేర్పండి..
ఇది అందరికీ తెలిసిన టెక్నిక్కే. కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చదివిన విషయాలను మీ స్నేహితుడికో లేక ఇతరులకో సులువైన పదాల్లో చెప్పేందుకు ప్రయత్నించండి. ఇది మీరు సమాచారాన్ని లాజికల్ గా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని మెదడుకు కల్పించినట్టవుతుంది. మీరు ఒక్కరే ప్రిపేర్ అవుతున్నప్పుడు లేక పక్కన ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఒక ఇమాజినరీ వ్యక్తిని ఊహించుకుని వారికి ఈ విషయాలను నేర్పే ప్రయత్నం చేయండి.

ప్రదేశాలను మారుస్తూ చదవండి..
మీరు చదువుకునే ప్రదేశం మీ ఆలోచనలను మెదడును ప్రభావితం చేయగలదు. అందుకే మీరు ఒకే ప్లేస్ కు అతుక్కుపోయి ప్రిపేర్ అయ్యే కన్నా ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో సబ్జెక్ట్ ను చదివే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల మీ మెమరీ పవర్ మరింత మెరుగవుతుంది.

రివిజన్ చేస్తున్నారా..
సమాచారాన్ని దగ్గర పెట్టుకుని చదవడానికి బదులుగా ఎప్పటికప్పుడు దాన్ని రివిజన్ చేసుకోవడం ఉత్తమంగా పనిచేస్తుంది. ఇదొక సైంటిఫికల్లీ ప్రూవ్డ్ టెక్నిక్. ఇది మీ లాంగ్ టర్మ్ మెమరీ పవర్ ను పెంచుతుంది. ఎటువంటి ఖాళీలను వదలకుండా భావనలను బాగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సాయపడుతుంది.

ఇంద్రియాలన్నింటినీ నిమగ్నం చేయండి..
వీడియో, ఆడియోలతో కూడిన స్టడీ మెటీరియల్ మీకెంతగానో ఉపయోగపడుతుంది. కొందరికి విన్నది బాగా గుర్తుంటుంది. మరికొందరు వీడియోల రూపంలో చూసింది ఎప్పటికీ మర్చిపోరు. ఇలా మీ ఇంద్రియాలన్నింటినీ ఇన్వాల్వ్ చేస్తూ చదవగలిగితే మీ మెదడు మరింత ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది.

కష్టమైన టాపిక్స్ కోసం..
కష్టమైన టాపిక్స్ ను గుర్తుంచుకోవడానికి మరో తేలిక మార్గం పదబంధాలు, ప్రాసలు లేదా సంక్షిప్త పదాల్లో గుర్తుంచుకోవడం. మీకు మరింత క్రియేటివిటీ ఉంటే ఇవి మీమ్మల్ని జిడ్డులా అంటిపెట్టుకుని ఉంటాయి. ఉదాహరణకు ‘పీఇఎండిఎఎస్’భాగాహారం, కూడికలు, మల్టిప్లికేషన్, తీసివేతల వంటి వాటిని ఒక్క పదంలో గుర్తుంచుకోవడానికి ఇదొక మంచి టెక్నిక్.

చదువుకు ముందు వ్యాయామం..
అవును. చదువుకు ముందు కసింత సేపు శారీరక శ్రమ చేయడం వల్ల మీ మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు చదివిన విషయాలు మీకు బాగా గుర్తుంటాయి. జిమ్ కి వెళ్లి బరువులెత్తాల్సిన అవసరం లేదు. సింపుల్ గా జాగింగ్ లేదా స్కిప్పింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు కూడా మీ మెదడు పనితీరును అద్భుతంగా మారుస్తాయి. వీటి ద్వారా చాలా ఈజీగా మీ టాపిక్స్ బుర్రకెక్కుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.