ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్, హీరోలను మించి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నటి, సినిమాల ద్వారా కోట్లు సంపాదించిన ఈబ్యూటీ, ప్రస్తుతం యాక్టీవ్ గా లేకపోయినా.. చేతినిండా సంపాదిస్తుంది. 4600 కోట్ల ఆస్తి కలిగి ఉన్న ఇండియన్ రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇండియన్ సినిమాలో రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు ఇండియలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి ఈమె. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళంలో కూడా నటించిన ఈమె ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్‌గా లేరు. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ సీనియర్ బ్యూటీ సినిమాలు లేకపోయినా కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.
ఆమె ఎవరో కాదు జూహీ చావ్లా. 1984లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత జూహీ చావ్లా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1986లో ధర్మేంద్ర, సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన సుల్తానత్ సినిమాలో చిన్న పాత్రలో ఆమె బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. కరణ్ కపూర్ కూడా ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు.
సుల్తానత్ తర్వాత రెండేళ్లకు జూహీ చావ్లా రొమాంటిక్ చిత్రం ఖయామత్ సె ఖయామత్ తక్‌లో నటించారు. అమీర్ ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం జూహీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా భారీ విజయం తర్వాత జూహీ వరుసగా సినిమాలు చేసింది. లూథెరే, ఐనా, దర్, హమ్ హై రాహీ ప్యార్ కే, ఇష్క్, దీవానా మస్తానా, యేస్ బాస్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
హిందీలో మాత్రమే కాదు తెలుగులో నాగార్జున జంటగా కొన్ని సినిమాలు చేసిన సీనియర్ బ్యూటీ.. మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి నటించింది. 2000 సంవత్సరం నుంచి జూహీ హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఝంకార్ బీట్స్ (2003), 3 దీవారిన్ (2003), మై బ్రదర్ నిఖిల్ (2005), ఐ యామ్ (2011), గులాబ్ గ్యాంగ్ (2014) సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సినిమాలతో పాటు అదే సమయంలో జూహీ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. రకరకాల బిజినెస్ లతో చేతి నిండా సంపాదించడం స్టార్ట్ చేశారు. షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ గ్రూప్‌లో జూహీ కో-ఫౌండర్. ఎస్ఆర్‌కేతో కలిసి ఐపీఎల్ క్రికెట్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆమె కో-ఓనర్. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో కూడా జూహీ పెట్టుబడులు పెట్టారు.
జూహీ, ఆమె భర్త జై మెహతాకు ముంబై, పోర్‌బందర్‌లలో లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. ముంబైలో గుస్టోసో, రూ డు లిబాన్ వంటి ఫైన్-డైనింగ్ రెస్టారెంట్లు కూడా వారికి ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2024లో జూహీ చావ్లా ఆస్తుల విలువ 4,600 కోట్ల రూపాయలు అని తెలిసింది. జూహీని ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ గా చెప్పవచ్చు.
































