యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించారు. గత మోడల్స్‌తో పోలిస్తే, స్టోరేజ్‌ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా చూపిస్తుంది.
ఇక ఇందులో వదిన A16 చిప్ టాబ్లెట్ పనితీరును, పవర్ ఎఫిషియెన్సీని బాగా పెంచుతుంది. పాత మోడల్స్‌తో పోలిస్తే స్పీడ్ 30 శాతం, ఓవరాల్ పనితీరు 50 శాతం పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల కంటే ఇది ఆరు రెట్లు వేగవంతంగా ఉంటుంది. A16 చిప్‌లో 5-కోర్ CPU, 4-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. ఇక ఈ ఐప్యాడ్‌లో కెమెరా, డిస్‌ప్లే ఫీచర్ల విషయానికి వస్తే.. వెనుక వైపు 12MP కెమెరా ఉంది. ముందు వైపు 12MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెంటర్ స్టేజ్ ఫీచర్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్స్‌లో కదులుతున్నా, ఫోకస్‌లో ఉంచుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 128GB రూ.34,900, 256GB రూ.44,900, 512GB రూ.64,900గా ఉన్నాయి. సెల్యులార్ మోడల్ 128GB ధర రూ.49,900. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఇక దీని ధర విషయానికి వస్తే.. 11 అంగుళాల వై-ఫై మోడల్ (128GB) ధర రూ.59,900 కాగా.. 11 అంగుళాల వై-ఫై + సెల్యులార్ (128GB) మోడల్ ధర రూ.74,900. అలాగే13 అంగుళాల వై-ఫై మోడల్ రూ.79,900. ఇంకా 13 అంగుళాల సెల్యులార్ మోడల్ రూ.94,900 గా ఆపిల్ నిర్ణయించింది. మార్చి 12 నుంచి యాపిల్ అధికారిక వెబ్‌సైట్, స్టోర్లలో లభిస్తుంది. మొత్తం మీద కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ రెండు టాబ్లెట్లు శక్తివంతమైన చిప్‌సెట్లు, మెరుగైన డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌తో వచ్చాయి. ప్రొఫెషనల్స్, గేమర్స్, సాధారణ వినియోగదారులకు ఇవి మంచి ఛాయిస్ అవుతాయి.
































