తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై అరెస్ట్.. లాక్కెళ్లిన పోలీసులు.

తమిళనాడులో ఇటీవల సీఎం స్టాలీన్ హింది భాషపై మండిపడుతున్నారు. హింది భాషఅనేక స్థానిక భాషల్ని నిర్వీర్యం చేస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగంగానే.. హిందిపైన తమ వ్యతిరేకతను బైటపెట్టారు. ఈ క్రమంలో తాజాగా.. తమిళనాడులో త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నేత అన్నామలై, తెలంగాణ మాజీ సీఎం తమిళి సై సైతం.. ఎంజీఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమంను నిర్వహించారు.


దీనిలో భాగంగా అనేక మంది బీజేపీ కార్యకర్తలు దీనిలో పాల్గొన్నారు. త్రిభాష విధానం ఉంటే తప్పేంటని తమిళి సై ప్రభుత్వంను నిలదీశారు. మన విద్యార్థులు విద్యా, ఉద్యోగాలలో అనేక అవకాశాలు లభిస్తాయని అన్నారు.

ఈ క్రమంలో సంతకాల సేకరణ వద్ద భారీగా జనాలు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. తమిళిసైని, అన్నామలైని, బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు..

అయితే తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దతుగా బుధవారం బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన కార్యక్రమంలో మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు.

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మూడు భాషల విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంను సీఎం స్టాలీన్ తమపై హిందినీ రుద్దుతున్నారని విమర్శలు చేసిన విషయంతెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళిసైను, అన్నామలైని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం తలెత్తింది. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.