హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఈ తెలుగు హీరోయిన్ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. శ్రీలీల మాస్ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమా చేసి సూపర్ హట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల హీరోయిన్గా విశేష గుర్తింపు పొందింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా శ్రీలీల నటిస్తోంది. తెలుగులో బిజీ హీరోయిన్గా మారిన శ్రీలీల తాజాగా లవ్‌లో పడిందని తెలుస్తోంది.
బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న శ్రీలీల అప్పుడే ప్రేమలో పడిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్‌తో శ్రీలీల ‘దిలర్’ అనే మూవీ చేస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం మరో స్థాయికి వెళ్లిందట. దీంతో అతడితో కలిసి పబ్‌లు, రెస్టారెంట్స్ అంటూ అమ్మడు తెగ తిరిగేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇబ్రహీం ఖాన్ పుట్టినరోజు నాడు శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు రాసింది. ‘హ్యాపీ బర్త్ డే ఇగ్గీ. నువ్వు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నావో దాని గురించి వెయిట్ చేయలేకపోతున్నా.. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే’ అంటూ హార్ట్స్ సింబల్‌ను శ్రీలీల షేర్ చేసింది. దీంతో అతడితో శ్రీలీల లవ్‌లో ఉందంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తుండగా.. తెలుగు, తమిళంలో మరికొన్ని సినిమాలు పట్టాలెక్కాల్సి ఉంది. కాగా కార్తీక్ ఆర్యన్‌తో నటించిన సినిమాలో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
































