మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లలో సపోటా పండ్లు ఒకటి.. ఈ పండ్ల ద్వారా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ మోతాదులో ఫైబర్ కంటెంట్ సహజమైన చక్కెర ఉండటం వల్ల ఇవి శరీరానికి అద్భుతమైన శక్తినందించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఖనిజాలు బోలెడు పోషకాలు కూడా ఉంటాయి. రోజు అల్పాహారాలలో భాగంగా సపోటా పండ్లను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పండ్ల నుంచి తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల మరెన్నో ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే సపోటా పండ్ల రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తక్షణ శక్తి:
సపోటా పండ్లలో సహజ చక్కెరలు (ఫ్రాక్టోజ్, సుక్రోజ్) సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఉదయాన్నే ఈ పండ్లతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల శరీరం తక్షణమైన శక్తిని పొందుతుంది. ముఖ్యంగా అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్గా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే వ్యాయామాలు చేసేవారు కూడా ఈ రసం రోజు ఉదయాన్నే తాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
రోగనిరోధక శక్తిని పెంచేందుకు:
సపోటా పండులో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషించడమే కాకుండా రక్త కణాల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వివిధ రకాల జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలకు:
సపోటా పండులో ఫైబర్ రూపంలో ఉండే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ క్రియను శక్తివంతంగా తయారు చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ప్రేగు కదలికలను సులభతరం చేసేందుకు కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట సపోట పండ్ల రసాన్ని తాగాల్సి ఉంటుంది.
చర్మానికి, జుట్టుకు మేలు:
సపోటా పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి.. ముఖ్యంగా ఈ రసంలో లభించే విటమిన్ ఎ చర్మ పునరుత్పత్తికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. తరచుగా చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారి రోజు ఉదయాన్నే సపోటా పండ్ల రసాన్ని తాగడం వల్ల విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు.
ఎముకలను బలోపేతం చేస్తుంది:
సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. వాటిని దృఢంగా చేసేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎముకల స్థితిని మెరుగుపరిచేందుకు కూడా సపోటా పండ్ల రసం ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల బోలి ఎముకల వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
































