ఎండలు బాబోయ్ ఎండలు..తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్

ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రికార్డ్‌ స్థాయిలో నమోదు అవుతుండగా.. కొన్నిప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.. చాలా ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. దిగువ ట్రోపోఆవరణములో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో పడమర – వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉండనున్నట్లు తెలిపింది.


ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. అలాగే వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ :- గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

అటు తెలంగాణలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, హనుమకొండలో ఎండ మండిపోతోంది. ఇవాళ ఖమ్మంలో 40 డిగ్రీలకు దగ్గర్లో ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్‌ ఉంది. హైదరాబాద్‌లోనూ 37 డిగ్రీలు దాటేస్తోంది ఎండ. తెలుగురాష్ట్రాల్లో మార్చిలోనే 125 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.