వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ప్రారంభించింది. ఈ రోజు (మార్చి 7) నుంచి ప్రారంభమైనీ సేల్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16, ఐఫోన్ 13, ఐఫోన్16ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 వంటి ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి ఫోన్ కొనడం ద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్‌లో ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం..
ఐఫోన్ 16పై భారీ తగ్గింపు:
ఈ సేల్‌లో ఐఫోన్ 16ను రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ.79,900తో కంపెనీ విడుదల చేయగా, ఆఫర్లో భాగంగా భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఈ మొబైల్ ధర రూ.68,999గా ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వారా రూ.4వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.5,000 రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకొని ఐఫోన్ 16 ని రూ.59,999కే పొందవచ్చు. అలానే ఐఫోన్ 16 ప్లస్‌ని రూ.69,999కి, ఐఫోన్ 16 ప్రోని రూ.1,03,900కి విక్రయిస్తోంది. ఇక ఐఫోన్ 16ఈ రూ.55,900, ఐఫోన్ 15 రూ.58,999, ఐఫోన్13 రూ.40,999 కే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24:
ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపుతో పొందవచ్చు. గెలాక్సీ ఎస్24 రూ.52,999, గెలాక్సీ ఎస్24 ప్లస్‌ని రూ.54,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 రూ.73,999కే లభిస్తుంది. తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 లాంచ్ ధర రూ.1,64,999 కాగా సేల్‌లో రూ.1,49,999కే పొందవచ్చు. అలాగే నథింగ్ ఫోన్లలోనూ డిస్కౌంట్లు ప్రకటించింది. నథింగ్ 2ఏ రూ.19,999, నథింగ్ 2ఏ ప్లస్ రూ.25,499కి పొందవచ్చు. ఇవే కాకుండా పలు రకాల బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది.
దీనితో పాటు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా ఫోన్ కొనుగోలుపై రూ. 2000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అదే సమయంలో,BOBCARD తో కస్టమర్లు 36 నెలల పాటు కేవలం రూ.2,813 నెలవారీ EMI ఎంపికతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

































