ప్రతి వంటగదిలో కనిపించే మసాలా దినుసులలో జీలకర్ర ఒకటి. ఇది ఆహారానికి అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర కడుపు సమస్యలను చాలా వరకు నయం చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక స్పూన్ జీలకర్ర గింజలను.. ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. దానికి సరిపడా నిమ్మరసం కలుపుకుని గోరువెచ్చగా తాగితే ఆరోగ్యానికి మేలు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
నిమ్మకాయ అనేది సిట్రస్ పండు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం, ఐరన్, జింక్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. జీలకర్ర పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన మసాలా దినుసు. జీలకర్ర నీళ్ళను నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరం నుంచి విషతుల్య పదార్థాలను బయటకు వెళ్లగొట్టడంలో సమర్థమైనవి జీలకర్ర నీళ్లు.
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసాన్ని జీలకర్ర నీటితో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి నిమ్మ-జీలకర్ర నీరు త్రాగడం కూడా మంచిది. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి వీటిని కూడా త్రాగవచ్చు. మెదడు పనితీరు మెరుగుపరిచి, జ్ఞాపకశక్తి పెరిగేలా చేయడంతో పాటు, ఏకాగ్రతనూ పెంచుతాయివి.
జీలకర్ర నీటిని నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. బొడ్డు కొవ్వు తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్, మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఈ నీటిలోని ఎ, సి విటమిన్లు వ్యాధికారక ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
ఈ నీటిలోని అధిక ఐరన్ వల్ల రక్తహీనత తొలగిపోతుంది. రక్తంలో తగినంత ఐరన్ లేకపోతే అవసరమైనన్ని ఎర్ర రక్త కణాలు తయారు కావు. ఫలితంగా నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంది. ఈ లోపాన్ని జీలకర్ర, నిమ్మరసం కలిపి తయారు చేసిన నీటితో భర్తీ చేయవచ్చు.
శ్వాసకోశ వ్యవస్థ- కఫాన్ని కరిగించే గుణం జీలకర్రకు ఉంది. ప్రతి రోజూ ఉదయం నిమ్మరసం కలిపిన జీలకర్ర నీరు తాగితే ఛాతీలో పేరుకున్న కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది. దీనిలోని వ్యాధి నిరోధక గుణాలు బ్యాక్టీరియాను చంపి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీలకర్ర నీటితో శరీరంలోని విషాలు హరిస్తాయి. ఫలితంగా చర్మం మచ్చలు లేకుండా తాజాదనాన్ని సంతరించుకుంటుంది. సహజసిద్ధమైన మెరుపు సొంతమవుతుంది.
































