Prabhas : మీరెప్పుడు చూడని ప్రభాస్ ని నేను చూపిస్తాను..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ”రాజాసాబ్”, ”ఫౌజీ’, ”సాలార్ 2” ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తిరక లేకుండా ప్రభాస్ తన జీవతాన్ని గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ”స్పిరిట్” అనే సినిమా చేస్తనట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కావలసింది కానీ వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి ”స్పిరిట్” సినిమాపై కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫర్ గా కనిపించబోతున్నాడు అని తెల్సిందే కానీ ఈ సినిమాలో ప్రభాస్ ను రెండు పాత్రల్లో సందీప్ చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పాత్రలో పోలీస్ గా మరో పాత్రలో గ్యాంగ్ స్టార్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఇంతక నుంచి నటించిన ”బిల్లా”, ”బాహుబలి” సినిమాలలో డ్యూయల్ రోల్ చేసిన.. ఆ సినిమాలలో ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ మాత్రం కనిపించలేదు. కానీ ”స్పిరిట్” సినిమాలో మాత్రం ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించడంతోపాటు.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ప్రభాస్ లు సందడి చేయనున్నారు. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్ స్టార్ మధ్య సాగె ఈ కధలో ఇద్దరు ప్రభాస్ లు మధ్య వచ్చే సీన్స్ అదిరిపోనున్నాయి అని సమాచారం. మునుపెప్పుడు చూడని ప్రభాస్ ని ఈ సినిమాలో ఊర మాస్ గా సందీప్ రెడ్డి చూపించబోతున్నాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.