పిఠాపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన(Jana Sena)లో చేరారు. డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన కండువా కప్పి దొరబాబును పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయనతో పాటు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్తపల్లి పద్మ, వైకాపా కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు జనసేనలో చేరారు.
శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
































