GOLD LOAN: బంగారు రుణం ఇప్పుడు చాలా కష్టం.. ఇవే కొత్త నియమాలు

బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్ని తాకట్టు పెట్టి చాలా మంది రుణాలు తీసుకొస్తుంటారు. కొందరు మోసాలకు పాల్పడటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్ విషయంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.


ఇంతకు ముందు గోల్డ్ లోన్ అంటే నిమిషాల్లో ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డు కట్ట వేయాలని ఆర్బీఐ భావిస్తోంది. బంగారం లోన్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఒరిజినల్ లేదా నకిలిదేనా? వారిదేనా? లేకపోతే ఇతరులదా? అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఇవ్వాలని భావిస్తోంది.

రూల్స్ కఠినం చేయాలని..

బంగారు రుణాల విషయంలో ఆర్థిక సంస్థలు అన్ని కూడా ఒకే రూల్స్ పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. రుణం విషయంలో దేశవ్యాప్తంగా జరిగిన లోపాలను ఆర్బీఐ గుర్తించింది. వడ్డీ విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేట్లను పాటిస్తుంది. ఒకే పాన్ కార్డుపై ఎక్కువ సార్లు రుణాలు ఇస్తోంది. కొందరు ఈ రుణాలను చెల్లించడం లేదు. ఈ కారణంగానే ఒకపై బంగారు రుణాల విషయంలో రూల్స్ మార్చాలని ప్లాన్ చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.