ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది 10 వేల స్కూళ్లలో వన్​ క్లాస్​ వన్​ టీచర్​ విధానం

ఏపీలో పదివేల స్కూళ్లలో వన్​క్లాస్​వన్​టీచర్ (One class One teacher)​ విధానాన్ని తీసుకువస్తామని ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేశ్​ (Nara Lokesh)(Nara Lokesh) ప్రకటించారు ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే వన్​క్లాస్​వన్​టీచర్​ విధానం ఉందన్నారు.


రాబోయే రోజుల్లో పదివేల స్కూళ్లలో వన్​క్లాస్​వన్​టీచర్​ విధానాన్ని తీసుకువస్తామన్నారు. విద్యార్థుల డ్రాపవుట్స్ (Dropouts) ​తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అమరావతిలో ప్రపంచస్థాయి టీచర్ ట్రైనింగ్​(Teacher training) ఇన్​స్టిట్యూట్​ను తీసుకువస్తామన్నారు. త్వరలో టీచర్ల సీనియారిటీ (Teachers Seniority list) జాబితా విడుదల చేస్తామ విద్యావ్యవస్థలో టీచర్ల పాత్ర కీలకమైనదని, వారిపై భారం ఉంటే పని చేయలేరని అన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో సీనియారిటీ జాబితా రూపొందించి, దానిని అందరికీ అందుబాటులో పెడతామన్నారు.ఏదైనా తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రచరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకోస్తున్నామని తెలిపారు. అమరావతిలో ప్రపంచస్థాయి టీచర్ ట్రైనింగ్​ ఇన్​స్టిట్యూట్​ను తీసుకువస్తామన్నారు.

విద్యార్థులకు అపార్ ఐడీని (Apar ID) కేంద్రం మ్యాండేట్ చేస్తోందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను తయారు చేస్తున్నామని తెలిపారు. ఒక్కరు కూడా డ్రాపవుట్ కాకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సీజనల్ హాస్టల్స్ కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉంది, హాస్టల్ వసతులు లేవు. కరువు ప్రాంతాల్లో ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాంమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 2024-25లో 121 సీజనల్ హాస్టళ్లు ఉండగా, వాటిలో 6,040 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించామని, ఇందుకోసం 6.04కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నారు. హాస్టళ్ల పనితీరు మెరుగు, గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో, స్టూడెంట్ టీచర్ రేషియో మెరుగుదలకు వచ్చే మూడేళ్లు కలసి పనిచేద్దాం అని సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.