ఏపీలో హౌస్‌ హోల్డ్‌ డేటా బేస్‌లో వివరాల నమోదుకు మార్గదర్శకాలు

పౌర సేవలు, పథకాలు అందుకునేందుకు ఏపీలో ప్రతి పౌరుడూ హౌస్‌ హోల్డ్‌ డేటా బేస్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పౌరసేవలు, పథకాలు అందించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలు పౌరుల వివరాలు నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అన్ని శాఖలు హౌస్ హోల్డ్ డేటా బేస్‌కు వివరాలు అనుసంధానించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పౌరసేవ దరఖాస్తుల పరిశీలన, ప్రభుత్వ పథకాలు, ఇతర లబ్ధి అందించే సమయంలో ఆర్టీజీఎస్, గ్రామవార్డు సచివాలయ విభాగం వద్ద ఉన్న హౌస్ హోల్డ్ డేటా బేస్‌తో సరిపోల్చి చూసుకునేలా ఆదేశాలు ఇచ్చింది.


డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్‌ చట్టం-2023 ప్రకారం హౌస్ హోల్డ్ డేటాలోని పౌరుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ వివరాలకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్టీజీఎస్, గ్రామవార్డు సచివాలయాల విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలకు మినహా ఇతర పనులకు ఈ వివరాలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామవార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.