ఆ ప్లాస్టిక్‌ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌రో తెలుసా

ఇడ్లీలు పార్సిల్‌ కట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్‌ కవర్లలోనే చుట్టేస్తున్నారు. దీంతో ఆ వేడికి ప్లాస్టిక్‌ కరిగి, దాని అవశేషాలు ఇడ్లీల్లోకి చేరిపోతున్నాయి. దీంతో ఇడ్లీల్లో ప్లాస్టిక్‌ అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇది వెలుగులోకి రావడంతో..ప్లాస్టిక్‌ కవర్లతో ఇడ్లీలు వేయడాన్ని బ్యాన్‌ చేస్తూ కర్నాటక సర్కార్‌ చర్యలు తీసుకుంది. ప్లాస్టిక్‌లో ఉండే కార్సోజెనిక్‌ రసాయనం మనకు తెలియకుండానే ఇడ్లీల ద్వారా మన కడుపులోకి వెళుతుంది. కార్సోజెనిక్‌ కేన్సర్‌ కారకం అని, అది ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో చేరితే కేన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. సో. ఇడ్లీలో ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువ అయ్యేకొద్దీ, మనకు కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయంటున్నారు వైద్యులు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.