కాపీ, పేస్ట్ తప్పు.. బ్యాంకు నుంచి రూ.52 వేల కోట్లు బదిలీ

కాపీ, పేస్ట్‌ పొరపాటు.. బ్యాంక్‌ నుంచి రూ. 52 వేల కోట్లు బదిలీ, మరుసటి రోజు ఈ తప్పిదాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించి సరిచేశారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అదే నెలలో బ్యాంకులో మరో తప్పిదం జరిగింది. మరో క్లయింట్‌ ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. 90 నిమిషాల్లో దీన్ని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమస్య గురించి బ్యాంకు రెగ్యులేటర్స్‌కు తెలియజేసినట్లు కథనం తెలిపింది. తమ బ్యాంకులో జరిగిన ఈ తప్పిదాలపై సిటీగ్రూప్‌ స్పందించింది. ‘‘బదిలీ ప్రక్రియలో జరిగిన తప్పిదాన్ని వెంటనే గుర్తించి పరిష్కరించామని తెలిపింది. దీని వల్ల ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగలేదనీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మానవ ప్రమేయాన్ని తగ్గించి.. ఆటోమేషన్‌ను మెరుగుపరిచాం అని ఒక ప్రకటనలో తెలిపింది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.