Gold Rate Today: బంగారం ధర భారీగా తగ్గింది.. ధర ఎంత?

పసిడి ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. సోమవారం (10 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం..


22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.80,390, 24 క్యారెట్ల పదిగ్రాముల గోల్డ్ ధర రూ.87,700 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,000 గా ఉంది. కాగా.. బంగారం 10 గ్రాములపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది.

బంగారం ధర గడచిన వారంతో పోలిస్తే ఈ వారం ప్రారంభం నుంచే తగుముఖం పట్టింది ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా 2000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతోంది నిజానికి బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి గత నెలతో పోల్చి చూస్తే ఈ నెల బంగారం ధరలు కాస్త స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు 87 వేల రూపాయల నుంచి 88 వేల రూపాయల మధ్యలో బంగారం ధర ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,390, 24 క్యారెట్ల ధర రూ.87,700 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,390, 24 క్యారెట్ల ధర రూ.87,700 గా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.