తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ రాగల మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి

ఆంధ్రప్రదేశ్లో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయిని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.అటు తెలంగాణలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, హనుమకొండలో ఎండ మండిపోతోంది. ఖమ్మంలో 40 డిగ్రీలకు దగ్గర్లో ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్‌ ఉంది. హైదరాబాద్‌లోనూ 37 డిగ్రీలు దాటేస్తోంది ఎండ. తెలుగురాష్ట్రాల్లో మార్చిలోనే 125 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.