ప్రస్తుతం పెద్ద టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ఇంచెస్ టీవీలను కొనుగోలు చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే.
అయితే తక్కువ ధరలో లభిస్తోన్న ప్రొజెక్టర్లతో ఇంటినే థియేటర్‌గా మార్చేయవచ్చు. అలాంటి ఒక బెస్ట్ ప్రొజెక్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓటీటీలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇంట్లోనే సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద స్క్రీన్ టీవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే భారీ స్క్రీన్ ధరలు ప్రస్తుతం లక్షల్లో పలుకుతున్నాయి. అలా కాకుండా ఒక చిన్న ప్రొజెక్టర్ ద్వారా ఇంటినే థియేటర్‌గా మార్చేసుకుంటే ఎలా ఉంటుంది.? అది కూడా కేవలం రూ. 10 వేల బడ్జెట్లో. అలాంటి ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా ప్రొజెక్టర్.? దాంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు చూద్దాం.
WZATCO Yuva Go Pro పేరుతో ఓ చిన్న ప్రొజెక్టర్ అందుబాటులో ఉంది. ఈ ప్రొజెక్టర్ అసలు ధర రూ. 29,990కాగా అమెజాన్‌లో ఏకంగా 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో దీనిని కేవలం రూ. 12,990కి సొంతం చేసుకోవచ్చు. కాగా అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 389 డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే కొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా ప్రొజెక్టర్‌ను సుమారు రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
ధర తక్కువని ఫీచర్ల విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనిలేదు. ఈ ప్రొజెక్టర్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ఇందులో ఆటో ఫోకస్, ఆటో 4డీ కీస్టోన్, 4 ఎక్స్ బ్రైట్నెస్, 4కే హెచ్డీఆర్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లను అందించారు. దీంతో చాలా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు.
క్లారిటీ విషయంలో కూడా అస్సలు రాజీపడాల్సిన పనిలేదు. ఇందులో 1080పిక్సెల్ రిజల్యూషన్ క్లారిటీతో సినిమాలు, వీడియోలు వీక్షించే అవకాశం ఉంది. ఈ ప్రొజెక్టర్ 4కే హెచ్డీఆర్కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో 5 వాట్స్ వైఫై స్పీకర్‌ను అందించారు. బ్లూటూత్ 5.0, డ్యూయల్ బాండ్ వైఫైని ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రొజెక్టర్‌ను 270 డిగ్రీలలో రొటేట్ చేసుకోవచ్చు. దీంతో నచ్చిన డైరెక్షన్లో వీడియోలను చూడొచ్చు.
డిస్ప్లే రిజల్యూషన్ విషయానికొస్తే 1920 x 1080కి సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఈ ప్రొడక్ట్‌పై ఏడాది వారంటీ ఇస్తుంది. వైబ్రంట్ కలర్, ఏఐ ఇమేజ్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లను అందించారు. ఈ ప్రొజెక్టర్ యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ ద్వారా 300 ఇంచెస్ స్క్రీన్ సైజ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో బ్లూ లైట్ ప్రొటెక్షన్, 4 ఎక్స్ హై బ్రైట్నెస్ వంటి ఫీచర్లను అందించారు.
































