BRS MLA Jagadeesh Reddy Suspended: తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. స్పీకర్ పదవికి భంగం కలిగేలా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సభలో ప్రకటించారు.
ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సభ మీ ఒక్కరిది కాదని అందరిది అని అన్నారు. ఇది స్పీకర్ను ఉద్దేశించి అన్నట్టు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా కౌటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే గందరగోళం నెలకొంది.
































