పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైన అనుకుంటే అది వారి కర్మ అంటూ నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి.. ” అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
జనసేన నేతల రియాక్షన్ ఏంటి?
మెగా ఫ్యామిలీపై ఈగ వాలినా కూడా ఒంటి కాలిపై లేచే బండ్ల గణేష్ ఇప్పుడు ఏకంగా నాగబాబుకే కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్ పై వర్మ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గణేష్ మాట్లాడింది కరక్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే నాగబాబుకు భలే కౌంటర్ ఇచ్చావ్ అంటూ మెచ్చుకుంటున్నారు. దీనిపై జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.