గెలవక ముందు జనసేనాని.. గెలిచాక —–: పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వరుస ట్వీట్లతో ఎటాక్ చేస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్.. శుక్రవారం ( మార్చి 14 ) చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో బహుభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలకు ట్వీట్ తో కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్..


తాజాగా పవన్ ను టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. గెలవక ముందు జనసేనాని.. గెలిచాక భజన సేనాని అంటూ పవన్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ బహుభాషా విధానంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ” మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.

ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతున్నారు జనసైనికులు. అయితే.. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన ట్వీట్లు చేయడం ఇది కొత్త కాదు.. గతంలో కూడా పవన్ పై ట్వీట్ల ద్వారా సెటైర్లు వేశారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికుల నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పై విమర్శల విషయంలో ప్రకాష్ రాజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. మరి, ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ నెట్టింట ఎంత దుమారం రేపుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.