ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. మఖ్యంగా ఎక్కవ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ అయిన సింపుల్ ఎనర్జీ, సింపుల్ వన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1,39,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కొత్త మోడల్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కిమీ వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది.

































