వివేకా హత్య కుట్రను బయటపెడతా: నిందితుడు సునీల్‌యాదవ్‌

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి పులివెందుల వైకాపా నాయకుల నుంచి ఐదేళ్లుగా బెదిరింపులు ఎదురవుతున్న తరుణంతో తాజాగా అదే కోవలోకి మరో నిందితుడు చేరాడు. ఈ కేసులో ఏ-2గా ఉన్న సునీల్‌ యాదవ్‌కు హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో సహ నిందితుల నుంచే ఇబ్బందులు, బెదిరింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పులివెందులలో వైకాపా నేతల అనుచరులు, మధ్యవర్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సునీల్‌ చెప్పాడు. ప్రాణాలకు ముప్పు ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.