ఆంధ్రప్రదేశ్ కు బిగ్ అలెర్ట్. రాష్ట్రంలో రానున్న 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.
అంతేకాక.. అండమాన్ సమీపంలో ఆవర్తనం ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని.. వర్షంతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. అయితే మరికొన్ని జిల్లాల్లో ఎండకూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని అంచనా వేశారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు చేశారు. రైతులు, ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని, పిడుగులు పడే అవకాశం ఉందని ఈ మేరకు అధికారులు హెచ్చరించారు.
ఇక ఇప్పటికే కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఏపీలోల అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు అధికారులు పేర్కొన్నారు.