సాధారణంగా ఒక ఉద్యోగి రాజీనామా చేస్తున్నాడంటే.. ఒక వివరణతో కూడిన సమాచారం ఉంటుంది. కానీ ఒక ఉద్యోగి కేవలం ఏడు పదాల్లోనే రాజీనామా చేస్తున్నా అంటూ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. ‘ఛారిటీ అకౌంటింగ్ నాది కాదు, నేను క్విట్ అవుతున్నాను’ అని ఒక కాగితంపై చేతితో రాసిన రాత ఏడు పదాలతో ఉండటం గమనించవచ్చు. దీనిని మా కొత్త ఉద్యోగి.. అతని డెస్క్ మీద కనుగొన్నాడు, అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.
ఈ రెడ్డిట్ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అందులో నిజాయితీ ఉందని చెబితే.. మరికొందరు ఎవరో మొరటుగా లేదా ఆకస్మికంగా రాసినట్లు ఉందని అన్నారు. నిజానికి ఇలాంటి రాజీనామా లేఖలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తుంటాయనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఉద్యోగులు అసహనానికి గురైతే.. ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.