రైతు భరోసా కీలక అప్డేట్.. త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు జమ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు మూడెకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన కొందరు రైతుల ఖాతాల్లో ఇంతవరకు డబ్బులు జమ కాలేదు. అయితే త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రైతు భరోసా కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించినట్లు తెలిసింది. దీనితో, మిగిలిన రైతుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ అయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.