సోషల్ మీడియాలో (Social media) ప్రతిరోజూ కొత్త ట్రెండ్లు వైరల్ అవుతుంటాయి. ఇటీవల Ghibli Studio Style ఇమేజెస్ (Images) అంతటినీ వేడుకలా మార్చివేశాయి. సెలబ్రిటీలు (Celebrities) నుండి సామాన్య వాడుకరులు వరకు తమ ఫోటోలను జీబ్లీ స్టైల్లోకి మార్చుకుని WhatsApp, Facebook, Instagramలో షేర్ (Share) చేసారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గింది. ప్రస్తుతం AI Digital Art ట్రెండ్లో Barbiecore హిట్ (Hit) అయ్యింది. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!
మీ చిన్నప్పుడు బార్బీ డాళ్ళ (Barbie dolls) గుర్తుంది కదా? అందమైన లుక్ (Look), కలర్ఫుల్ (Colorful) డ్రెస్లు, మరియు థీమ్డ్ (Themed) యాక్సెసరీస్తో (Accessories) ప్యాక్ చేయబడతాయి. Barbiecore ట్రెండ్ కూడా అదే స్టైల్లో మీ ఫోటోలను డిజైన్ (Design) చేస్తుంది. కేవలం బార్బీగా మాత్రమే కాదు, Ken Doll, Marvel Superheroes లేదా ఇతర యాక్షన్ ఫిగర్ల (Action Figures) రూపంలో కూడా మీ ఇమేజెస్ (Images)ను మార్చవచ్చు. ఈ ట్రెండ్తో యూజర్లు (Users) తమ ఫోటోలను డిజిటల్ బొమ్మ బాక్స్ (Digital Toy Box) లాగా క్రియేట్ (Create) చేసి సోషల్ మీడియాలో పోస్ట్ (Post) చేస్తున్నారు. కొందరు తమ ఇష్టమైన సెలబ్రిటీల (Celebrities) ఫోటోలతో కూడా Barbiecore వర్జన్లను (Versions) తయారు చేస్తున్నారు.
Barbiecore ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి?
- ChatGPT యాప్ (App) లేదా వెబ్ బ్రౌజర్ (Web Browser) ను ఓపెన్ (Open) చేయండి.
- మీకు నచ్చిన హై-రెజల్యూషన్ ఫోటో (High-resolution photo) అప్లోడ్ (Upload) చేయండి.
- ప్రాంప్ట్ (Prompt) రాయండి. ఉదాహరణకు: “Transform this photo into a real-life Barbie action figure inside a toy box. Add bold text with my name on the box.”
- AI ఆధారంగా ఇమేజ్ జనరేట్ (Generate) అవుతుంది. రిజల్ట్ (Result) నచ్చకపోతే మార్పులు (Edits) చేయండి.
- ఫైనల్ ఇమేజ్ (Final Image) డౌన్లోడ్ (Download) చేసుకుని, సోషల్ మీడియాలో షేర్ (Share) చేయండి!
































