తెలంగాణ 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు : తెలంగాణలో ఉద్యోగార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న Anganwadi Jobs భర్తీకి సంబంధించి త్వరలో శుభవార్త రానుంది. వివరాల్లోకి వెళితే…
TG Anganwadi Recruitment 2025 : తెలంగాణ ప్రభుత్వం గత 6-7 నెలలుగా నిలిచిపోయిన Government Jobs నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతోంది. SC Categorization విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత, ఇకపై Job Notifications వరుసగా విడుదలవుతాయి.
ప్రభుత్వం ఇప్పుడు Job Calendarను మళ్లీ ప్లాన్ చేస్తోంది. దీనితో Group 1, 2, 3, 4 Jobs, Police Jobs, Gurukul Jobs, Women & Child Welfare Department, Health Department మొదలైన శాఖల నుండి కూడా భర్తీలు జరగనున్నాయి.
తాజా న్యూస్ ప్రకారం, 14,236 Anganwadi Worker & Helper Posts మరియు Health Departmentలో 4,000+ Vacanciesకు ఏప్రిల్ చివరి వరకు నోటిఫికేషన్లు విడుదల కావచ్చు. అలాగే, TSTC (Telangana State Road Transport Corporation)లో 3,038 Jobsకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా త్వరలో ప్రకటించబడుతుంది.
గత సంవత్సరం Job Calendar ప్రకారం, ఈ ఏడాది Police Recruitment (April), TGPSC Group-2 (May), Group-3 (July) నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. కానీ SC Categorization కారణంగా కొన్ని నోటిఫికేషన్లు ఆపివేయబడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం Revised Job Calendar తయారు చేస్తోంది.
అర్హతలు :
ఇంతకు ముందు Anganwadi Teacher పోస్టులకు 10th Pass అర్హత ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క New Guidelines ప్రకారం, ఇప్పుడు Intermediate (12th Pass) తప్పనిసరి అవుతుంది. Age Limit 18-35 Yearsగా ఉండవచ్చు. ఈ వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి.
































