AP Teacher Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ (SET) పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల్లో 1,136 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు, 1,124 స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా నిర్వహించనున్నారు. ఆటిజం, మానసిక వైకల్యాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక బోధనా సదుపాయాలను అందించేందుకు ఈ నియామకాలు చేయనున్నారు.
AP DSC Notification 2025 : ఈ నెలలోనే ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP DSC 2025 నోటిఫికేషన్‌ను ఈ ఏప్రిల్‌లోనే విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu, విద్యామంత్రి Nara Lokesh ఈ విషయంపై అధికారికంగా ధ్రువీకరించారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు జూన్‌లోనే ఈ నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే AP TET Results 2024 ప్రకటించబడ్డాయి. 1,87,256 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ TET Scoreకు లైఫ్ టైం వాలిడిటీ ఉంది మరియు AP DSC Recruitmentలో 20% వెయిటేజీ ఇవ్వబడుతుంది.

































