విడాకులు క్రెడిట్ స్కోర్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి?
విడాకులు తీసుకోవడం ద్వారా దాంపత్య బంధం నుండి విముక్తి లభించినప్పటికీ, ఆర్థిక బాధ్యతలు మాత్రం సులభంగా తొలగవు. విడాకులు మీ Credit Score పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని మీకు తెలుసా? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి, విడాకులకు ముందు ఈ ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు, Divorce Affect Credit Score కు దారితీసే ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Credit Score పై విడాకుల ప్రభావం
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే జంటల సంఖ్య గణనీయంగా పెరిగింది. కుటుంబ వివాదాలు, విశ్వాసం లేకపోవడం, ఆర్థిక ఒత్తిళ్లు వంటి కారణాలతో అనేకరు విడాకుల ద్వారా తమ వివాహ జీవితానికి ముగింపు పలుకుతున్నారు. కొత్త భాగస్వాములతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే, విడాకులు తీసుకోవడం వల్ల మీ Credit Score దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
1. ఉమ్మడి ఖాతాలు & లోన్లు
విడాకులు తీసుకున్న తర్వాత కూడా, Joint Accounts, Home Loans, Personal Loans, లేదా Credit Cards మూసివేయనంత వరకు కొనసాగుతాయి. ఈ ఖాతాల్లో చెల్లింపులు ఆలస్యం అయితే లేదా నిలిపివేయబడితే, ఇద్దరి Credit Score కు నష్టం ఏర్పడుతుంది.
2. ఆలిమనీ/భరణం బాధ్యతలు
విడాకుల తర్వాత ఒకరికి మరొకరు Alimony లేదా Child Support చెల్లించాల్సి వస్తుంది. ఇది ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, EMI Payments చేయడంలో కష్టమవుతుంది. ఇది Credit Scoreను తగ్గించే ప్రమాదాన్ని పెంచుతుంది.
3. క్రెడిట్ హిస్టరీ & యుటిలైజేషన్ రేషియో
విడాకుల తర్వాత Joint Credit Accountsని మూసివేయడం వల్ల Credit History తగ్గుతుంది. అదేవిధంగా, Credit Utilization Ratio (క్రెడిట్ లిమిట్‌లో ఎంత వాడుతున్నారు) పెరిగితే, ఇది కూడా Credit Score పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
క్రెడిట్ స్కోర్‌ను రక్షించుకోవడానికి చిట్కాలు
- Joint Accountsని వెంటనే మూసివేయండి లేదా వేరు చేయండి.
- Loan Payments & Credit Card Billsని సకాలంలో చెల్లించండి.
- Credit Reportని క్రమం తప్పకుండా పరిశీలించండి.
- Credit Utilizationను 30% కంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి.































