తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం
ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి.
ఒకవైపు చిరుజల్లులు పడుతుంటే, మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిమీ వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వడగండ్ల వర్షానికి హెచ్చరిక
ఈరోజు ఏప్రిల్ 21 (సోమవారం) నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు ఇదే పెరుగుదల
-
ఆదిలాబాద్: 43.8°C
-
నిజామాబాద్: 42.3°C
-
మెదక్: 40.6°C
-
రామగుండం: 40.2°C
-
ఖమ్మం: 39.8°C
-
మహబూబ్నగర్: 39°C
-
హనుమకొండ: 39°C
-
భద్రాచలం: 38.8°C
-
నల్లగొండ: 38.5°C
-
హైదరాబాద్: 36.9°C
ఈరోజు గరిష్టంగా ఆదిలాబాద్లో 43.5°C, కనిష్టంగా హైదరాబాద్లో 38.8°C నమోదు కానున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఆరెంజ్ అలెర్ట్
సోమవారం నాడు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2–3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో వడగాలులకు హెచ్చరిక
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 21) నాడు రాష్ట్రంలోని శ్రీకాకుళం (4 మండలాలు), విజయనగరం (16), పార్వతీపురం మన్యం (11) మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని మండలాల్లో సాదారణ వడగాలులు నమోదవుతాయి.
నిన్న ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6°C, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడు 42.5°C, నెల్లూరు జిల్లా మనుబోలు 42.4°C, పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్ జిల్లా ఉప్పలూరు 42.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే ఐదు రోజుల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల వరకూ పెరిగే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
































