Tech Tips: మీ కంప్యూటర్‌లో WhatsApp డెస్క్‌టాప్ వాడుతున్నారా? ఈ ఒక్క సైబర్ హ్యాకింగ్ మీ సిస్టమ్‌ను ప్రమాదంలో పడేస్తుంది!

భారత ప్రభుత్వం యొక్క సైబర్ భద్రతా సంస్థ CERT-In ఇటీవల WhatsApp డెస్క్‌టాప్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. Windows OSలో WhatsApp డెస్క్‌టాప్ వర్షన్ 2.2450.6 కంటే తక్కువ ఉన్న వారికి ఈ సైబర్ దాడి ప్రమాదం ఎక్కువ. హ్యాకర్లు ఈ దోషాన్ని ఉపయోగించి మీ సిస్టమ్‌కు ప్రవేశించి, సున్నితమైన డేటాను దొంగిలించవచ్చు లేదా మీ డివైస్‌ను పూర్తిగా నియంత్రించవచ్చు.


ఏ డివైస్‌లు ప్రమాదంలో ఉన్నాయి?

  • Windows కంప్యూటర్‌లు (WhatsApp డెస్క్‌టాప్ వాడుతున్నవారు)
  • 2.2450.6 కంటే తక్కువ వెర్షన్‌లు
  • MIME రకాలు & ఫైల్ ఎక్స్టెన్షన్‌ల తప్పుడు కాన్ఫిగరేషన్ కారణంగా ఈ హ్యాకింగ్ సాధ్యమవుతుంది.

హ్యాకర్లు ఎలా దాడి చేస్తారు?

  • మీరు WhatsApp ద్వారా అనుమానాస్పద ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి తెరిస్తే, హ్యాకర్లు మీ సిస్టమ్‌లోకి ప్రవేశించవచ్చు.
  • రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ (RCE) ద్వారా మీ డేటాను దొంగిలించవచ్చు.

ఎలా జాగ్రత్త పడాలి?

  • WhatsApp డెస్క్‌టాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
  • Windows OSని కూడా లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేట్ చేయండి.
  • అనుమానాస్పద లింక్‌లు లేదా ఫైల్‌లను ఓపెన్ చేయకండి.

డిజిటల్ భద్రతకు నిరంతరం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు చాలా అవసరం. ప్రతి అప్‌డేట్ కొత్త భద్రతా ప్యాచ్‌లను తెస్తుంది, కాబట్టి మీ డివైస్‌లను ఎల్లప్పుడూ తాజాగా ఉంచండి!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.