శ్రీకాకుళం పట్టణంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ HQHCS సెంటర్ ద్వారా మూడు నెలల పాటు ఉచిత నర్సింగ్ శిక్షణ అందించబడుతుంది. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిరుద్యోగ యువతకు నర్సింగ్ రంగంలో నైపుణ్యాలు నేర్పించడమే కాకుండా, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తుంది.
కోర్సు వివరాలు:
-
కోర్సు పేరు: జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (GDA) నర్సింగ్ శిక్షణ
-
కాల వ్యవధి: 3 నెలలు
-
స్థానం: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ HQHCS సెంటర్, 2వ అంతస్తు, ఉమెన్స్ కాలేజ్ రోడ్, సూర్య మహల్ జంక్షన్ దగ్గర, శ్రీకాకుళం.
-
శిక్షణ రూపం: థియరీ, ప్రాక్టికల్ ట్రైనింగ్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్ & బేసిక్ ఇంగ్లీష్.
-
సదుపాయాలు: ఆధునిక ల్యాబ్, అనుభవజ్ఞుల ట్రైనర్లు, డిజిటల్ క్లాసెస్.
-
ఉచిత శిక్షణ: రెడ్డీస్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తున్నది.
-
ఉద్యోగ అవకాశాలు: కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ & ప్రైవేట్ హాస్పిటల్స్లో జాబ్ ప్లేస్మెంట్ సహాయం.
-
హాస్టల్ సదుపాయం: దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
అర్హతలు:
-
విద్య: కనీసం 10వ తరగతి పాస్ (ఇంటర్మీడియట్/ఇంజనీరింగ్ చదివినవారికి ప్రాధాన్యత).
-
వయస్సు: 19 నుండి 30 సంవత్సరాలు.
-
సిద్ధత: ఏపీ/టీఎస్ లోని హాస్పిటల్స్ లో పనిచేయడానికి ఇష్టపడేవారు.
-
టైమింగ్: రోజువారీ క్లాసులు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు.
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు శ్రీకాకుళంలోని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ HQHCS సెంటర్ కు నేరుగా సంప్రదించండి. ఈ కోర్సులో పాల్గొని నర్సింగ్ రంగంలో కెరీర్ నిర్మించుకోండి!































