ఈ WhatsApp సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా? చాలా ఉపయోగకరమైనది!

ప్రస్తుతం అన్ని రంగాలలో WhatsApp వాడకం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని WhatsApp క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ, పంపిన వ్యక్తికి తెలియకుండా వారు పంపిన WhatsApp సందేశాలను ఎలా చదవాలో తెలుసుకుందాం.


భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులతో WhatsApp కమ్యూనికేషన్ కు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ప్రధాన వేదికగా నిలిచింది. సాధారణంగా, మీకు వచ్చిన WhatsApp సందేశాన్ని మీరు చదివిన తర్వాత, ఆ సందేశం పంపిన వ్యక్తి ఫోన్ లో బ్లూ టిక్ (✓✓) కనిపిస్తుంది. దీని అర్థం మీరు ఆ సందేశాన్ని చదివారని పంపిన వ్యక్తికి తెలుస్తుంది.

తెలియకుండా WhatsApp మెసేజ్ ఎలా చదవాలి?

కొన్నిసార్లు మీరు సందేశాలు చదవాలనుకుంటారు, కానీ పంపిన వ్యక్తికి తెలియకూడదనుకుంటారు. అలాంటి సందర్భాలకు ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. దీనికి మీ WhatsApp సెట్టింగ్లలోని ప్రైవసీ సెట్టింగ్లను మార్చాలి. ఈ విధంగా, మీరు ఇతరులు పంపిన మెసేజ్ చదివినా, పంపిన వ్యక్తికి బ్లూ టిక్ కనిపించదు. అంటే, మీరు ఆ మెసేజ్ చదివినట్లు వారికి తెలియదు.

బ్లూ టిక్స్ ను డిసేబుల్ చేయడానికి స్టెప్స్:

  1. మీ ఫోన్ లో WhatsApp ఆప్ ని ఓపెన్ చేయండి.

  2. సెట్టింగ్స్ (Settings) > ప్రైవసీ (Privacy) లోకి వెళ్లండి.

  3. “రీడ్ రిసీప్ట్స్ (Read Receipts)” ఆప్షన్ ను కనుగొని, దాన్ని ఆఫ్ (Off) చేయండి.

  4. ఇప్పుడు మీరు ఇతరుల మెసేజ్ చదివినా, వారికి బ్లూ టిక్ కనిపించదు.

గమనిక: ఈ సెట్టింగ్ ఆఫ్ చేసిన తర్వాత, మీరు పంపిన మెసేజ్ ఇతరులు చదివారో లేదో కూడా మీకు తెలియదు.

లాస్ట్ సీన్ & ఆన్లైన్ స్టేటస్ ను ఎలా హైడ్ చేయాలి?

మీ “లాస్ట్ సీన్” (Last Seen) మరియు “ఆన్లైన్ స్టేటస్” (Online Status) ను కూడా హైడ్ చేయవచ్చు. దీనికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో చేయండి:

  1. WhatsApp సెట్టింగ్స్ > ప్రైవసీ లోకి వెళ్లండి.

  2. “Last Seen & Online” ఆప్షన్ ను ఎంచుకోండి.

  3. ఈ నాలుగు ఆప్షన్ల నుండి ఎంచుకోండి:

    • అందరూ (Everyone)

    • నా కాంటాక్ట్స్ (My Contacts)

    • నా కాంటాక్ట్స్ తప్ప (My Contacts Except)

    • ఎవరూ కాదు (Nobody)

  4. ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం మీ లాస్ట్ సీన్ & ఆన్లైన్ స్టేటస్ ఇతరులకు కనిపించదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.