ఇప్పటి యువత ఆలోచనలు ఆశ్చర్యకరంగా మారుతున్నాయి.
వయసుకు మించిన తెలివి ప్రదర్శించడం ఓవైపు అయితే, ఆ తెలివి మంచి దిశగా కాకుండా, తప్పుదారి పట్టడం మరోవైపు ఉంది. ఆధునికతను ఆశ్రయించడం తప్పు కాదు, కానీ అది ఇతరులకు సమస్యగా మారకూడదు.
తాజాగా తెలంగాణలో ఓ యువకుడు చేసిన పని తల్లిదండ్రులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. “చదువు మంచిది”ని ట్యూషన్‌కు పంపిన కొడుకు, అకస్మాత్తుగా ట్యూషన్ మానేసి ఇంట్లో ఉన్న లక్షల రూపాయల నగదును దొంగలించి ట్యూషన్ టీచర్‌కు ఇచ్చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
రూ.2 లక్షల డబ్బు దొంగిలింపు కేసు
ఈ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగింది. తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకోవాలని ట్యూషన్‌కి వెళ్లిన బాలుడు, ట్యూషన్ టీచర్‌తో ఏర్పడ్డ అనుబంధం కారణంగా లక్షల రూపాయలు ఆమెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక, ఆమెకు ఖరీదైన ఐఫోన్‌ను కూడా కొనిచ్చాడు. కానీ టీచర్ ఐఫోన్ వద్దని, డబ్బే కావాలని చెప్పడంతో, ఆ బాలుడు దాన్ని అమ్మి రూ.2 లక్షలు ఆమెకు ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ విషయమంతా బయటపడింది ఎలా అంటే – మొబైల్ షాప్ యజమాని ఐఫోన్ అమ్మిన విషయాన్ని ఆ బాలుడి తండ్రికి తెలియజేశాడు. దీంతో అసలు విషయం బహిర్గతమైంది. ఆ యువకుడు తన ఇంట్లో దొంగతనం చేసిన వెనుక టీచర్ ప్రేరణ ఉన్నట్లు తేలింది.
తన కొడుకు చేసిన పనికి తండ్రి తీవ్రంగా దిగ్భ్రాంతిచెందాడు. చివరికి పోలీసులు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు స్పందించకపోవడంతో, ఆయను HRCకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
































