AP CID Home Guards Recruitment 2025: 28 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అర్హతలు, దరఖాస్తు విధానం

ఆంధ్రప్రదేశ్ సీఐడీ (AP CID) విభాగంలో హోంగార్డ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.


అర్హతలు:

  • వయస్సు: 18 నుంచి 50 సంవత్సరాలు (2025 మే 1 నాటికి).

  • ఎత్తు: పురుషులు – 160 సెం.మీ, మహిళలు – 150 సెం.మీ (ఎస్టీ మహిళలకు 5 సెం.మీ రాయితీ).

  • విద్య: ఇంటర్మీడియట్ (బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం).

  • ఇతర అవసరాలు:

    • కంప్యూటర్ పరిజ్ఞానం.

    • లైట్/హెవీ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్.

    • ఆంధ్రప్రదేశ్ నివాసితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

  • దరఖాస్తు పరిశీలన.

  • శారీరక కొలతల పరీక్ష.

  • కంప్యూటర్, టైపింగ్, డ్రైవింగ్ టెస్ట్.

  • చివరగా ఎంపికైన అభ్యర్థులకు రోజుకు ₹710 డ్యూటీ అలవెన్స్ చెల్లించబడుతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్లైన్ దరఖాస్తు: AP CID అధికారిక వెబ్సైట్ ద్వారా మే 1-15 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆఫ్లైన్ దరఖాస్తు: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, మంగళగిరి-522503 కు పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభం: మే 1, 2025.

  • దరఖాస్తు గడువు: మే 15, 2025.

అదనపు సమాచారం:

  • సందేహాలకు 9440700860 నంబర్కు ఆఫీసు గంటల్లో సంప్రదించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.