AP Mega DSC 2025 స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల – రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

AP Mega DSC 2025 లో క్రీడా కోటా ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 421 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 2 నుండి మే 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఏపీ డీఎస్సీ 2025 క్రీడా కోటా భర్తీకి నోటిఫికేషన్ విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేయబడింది. ఈ భర్తీలో రాత పరీక్ష ఉండదు, మెరిట్ మాత్రమే ప్రధానంగా పరిగణించబడుతుంది. డీఎస్సీ-2025లో మొత్తం 16,347 పోస్టుల్లో 3% (421) స్పోర్ట్స్ కోటా కింద కేటాయించబడ్డాయి.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభకు న్యాయం చేయడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం, డీఎస్సీ నియామకాల్లో అర్హులైన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి.

గత ప్రభుత్వం క్రీడాకారులను నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపించి, ప్రస్తుత ప్రభుత్వం వారికి 3% రిజర్వేషన్ కల్పించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడమైనదని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్లైన్ దరఖాస్తులు మే 2 నుండి మే 31 వరకు https://sports.ap.gov.in లేదా https://sportsdsc.apcfss.in వద్ద సమర్పించాలి.

  • ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.

పోస్టుల వివరాలు:

  • ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలలు: 333 పోస్టులు

  • మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలలు: 30 పోస్టులు

  • ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ పాఠశాలలు: 22 పోస్టులు

  • రెసిడెన్షియల్ పాఠశాలలు: 2 పోస్టులు

  • మోడల్ పాఠశాలలు: 4 పోస్టులు

  • సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు: 7 పోస్టులు

  • గురుకుల వెల్ఫేర్ పాఠశాలలు: 23 పోస్టులు

క్రీడాకారులకు ఉద్యోగ భద్రత, గౌరవం మరియు స్థిరమైన జీవితం కల్పించడానికి ఈ భర్తీ ఒక మంచి అవకాశం. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు క్రీడా శాఖ మంత్రి లోకేష్ కు రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.