నీట్ (యూజీ) 2025 అడ్మిట్ కార్డులు విడుదలైయ్యాయి. ఎన్టీఏ (NTA) మే 4న జరగనున్న నీట్ (యూజీ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు నీట్ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నీట్ (యూజీ) పరీక్ష హాల్ టికెట్లు విడుదల:
ఎన్టీఏ మే 4న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ (యూజీ) పరీక్షకు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు మరియు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
👉 NEET UG 2025 Admit Card Download Link
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసే విధానం:
-
నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inని సందర్శించండి.
-
హోమ్ పేజీలో “NEET UG 2025 Admit Card” లింక్‌పై క్లిక్ చేయండి.
-
లాగిన్ పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.
-
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌లో కనిపిస్తుంది.
-
వివరాలను ధృవీకరించి, డౌన్లోడ్ & ప్రింట్ చేసుకోండి.
ప్రాముఖ్యత:
-
పరీక్ష మే 4, 2025, మధ్యాహ్నం 2:00 PM నుండి 5:00 PM వరకు ఒకే షిఫ్ట్‌లో జరుగుతుంది.
-
అడ్మిట్ కార్డ్ తో పాటు వాహనం, ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్) తీసుకురావాలి.
-
డౌన్లోడ్ సమస్యలు ఉంటే, టోల్ ఫ్రీ నెంబర్లు 011-40759000 / 011-69227700 లేదా ఈమెయిల్ neetug2025@nta.ac.inకి సంప్రదించండి.
































