మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి చేసి, దీర్ఘ కాలంలో మంచి రాబడులను పొందాలని చూస్తున్నారా. అయితే అందుకోసం మీకు చక్కటి ఛాన్స్ ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). దీనిలో మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేసి మీ కలలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఒకేసారి రూ.3.5 లక్షలు పెట్టుబడి చేసి, కోటి రూపాయలు ఎలా సంపాదించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్వెస్ట్ మొత్తం
మ్యూచువల్ ఫండ్లు వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేయడం ద్వారా మీకు లాభాలను అందిస్తాయి. ఈ లాభాల ద్వారా మీరు సమయంతో పాటు వడ్డీపై వడ్డీ (కంపౌండింగ్) విధానంలో మీరు మంచి రాబడులను పొందుతారు. ఈ క్రమంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో మీరు సిప్ విధానంలో ఒకేసారి రూ.3.5 లక్షలు పెట్టుబడి పెట్టి, 30 సంవత్సరాల తర్వాత 12% వార్షిక వడ్డీతో కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది అసాధ్యమేమి కాదు. మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా, దీన్ని సాధించడం మరింత సులభం అవుతుంది.
కోటికిపైగా రాబడి
మీరు సిప్ విధానంలో రూ.3.5 లక్షల పెట్టుబడి చేస్తే 30 సంవత్సరాల్లో కోటి రూపాయలుగా మారుతుంది. ఇది కంపౌండింగ్ ప్రభావం వల్ల సాధ్యమవుతుంది. ఈ క్రమంలో వార్షిక వడ్డీ రేటు సగటున 12 శాతం చొప్పున తీసుకుంటే మీకు రూ.1,04,85,973 లభిస్తాయి. ఈ క్రమంలో మీకు వడ్డీ రూపంలోనే రూ.1,01,35,973 వస్తుంది. ఒక వేళ 15 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం చూస్తే మాత్రం 30 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం డబుల్ అవుతుంది. అంటే మీకు రూ.2,31,74,120 వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి చేసే విషయంలో గమనించాల్సిన అంశాలు
- రిస్క్ టోలరెన్స్: మీరు తీసుకునే రిస్క్ స్థాయి గురించి ఆలోచించాలి. రిస్క్ ఎక్కువగా ఉంటే రిటర్స్న్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
- వ్యవధి: పెట్టుబడులకు మీరు కేటాయించే సమయం ఎంత అనే దానిపై కూడా మీ రాబడులపై ఆధారపడి ఉంటుంది
- ఫండ్ ఎంపిక: ఫండ్ గత పనితీరు, వ్యయ నిష్పత్తి వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది
- డైవర్సిఫికేషన్: వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడులు చేయాల్సిన విధానంపై ముందుగానే మీరు నిర్ణయించుకోవాలి
గమనిక: మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.
































