పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించింది. ఇదిలా ఉండగా.. దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో వీర జవాన్ తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పలువురు మంత్రులు పరామర్శించారు. ఈ విషాద ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా స్పందించారు. ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్ మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లారు.
































