న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఇది ‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగం. తొలి రెండు పార్ట్స్‌ను తెరకెక్కించిన శైలేష్ కొలను ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రశాంతి త్రిపిర్నేని, నాని నిర్మాతలుగా వ్యవహరించారు. మే 1న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది.
విమర్శకుల అభిప్రాయాల ప్రకారం సినిమాలో హింసా దృశ్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కథన శైలి, నటన, తెరపై నాని ప్రభావంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు సమాచారం. రెండో వారానికి కూడా కొన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ షోస్ కొనసాగుతున్నాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇక సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా, తాజా సమాచారం ప్రకారం, హిట్ 3 సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లు చెల్లించినట్టు సమాచారం. థియేటర్ రిలీజ్ తర్వాత ఐదు వారాల వ్యవధిలో ఓటీటీకి వస్తుందనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
ఈ లెక్కన చూస్తే, జూన్ తొలి లేదా రెండో వారంలో ‘హిట్ 3’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కథానాయికగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటించగా, సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్రఖని, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
































