మారుతికి గట్టి పోటీ ఇచ్చిన కారు ధర పెరిగింది.. ఎంతో తెలుసా?

దేశంలో అగ్రస్థాయిలో సేల్స్ పెంచే కారే ఏదంటే మారుతి గురించి చాలా మంది చెబుతూ ఉంటారు. బడ్జెట్ కార్ల నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని రకాల కార్లు ఈ కంపెనీలో ఉన్నాయి. ఈ కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న కారుగా పేరు సంపాదించుకుంది. అయితే ఇలాంటి కారుకు టాటా కంపెనీకి చెందిన Tiago గట్టి పోటీ ఇస్తుంది. మారుతి వ్యాగన్ ఆర్ కారులో ఉండే ఫీచర్లు అన్నీ టాటా టియాగోలో ఉండడంతో చాలా మంది టియాగో వైపు వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ కారు ధరలు పెరిగాయి. ఇవే కాకుండా టాటా కంపెనీకి చెందిన మరో డిమాండ్ ఉన్న కారు ధర కూడా పెరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..


దేశంలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న టాటా కంపెనీకి చెందిన టాటా టియాగో 2025 సంవత్సరంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన మారుతి వ్యాగన్ ఆర్ కారును ఇది బీట్ చేసింది. టాటా టియాగోలో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన ఈ కారులో సీఎన్ జీ ఆప్షన్ తో కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చు. ఇందులో మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

టాటా టియాగో ధరలు ప్రస్తుతం మార్కెట్లో రూ.5 లక్షల నుంచి రూ.8.75 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే రూ. 5 లక్షల ఎక్స్ షోరూం కలిగిన కారులో ఎలాంటి మార్పులు లేవు. అయితే మొత్తం 9 వేరియంట్లు ఈ మోడల్ లో ఉన్నాయి. వీటిలో 8 వేరియంట్ల ధరలు పెరిగాయి. ఇవి రూ. 5,000 నుంచి రూ.10,000 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో టాటా టియాగో ఎక్స్. ఎం వేరియంట్ ఎక్స్ షోరూం ధర ఇప్పటి వరకు రూ.5.70 లక్షలు ఉండగా.. ఇక నుంచి రూ.5.80 లక్షలతో విక్రయించనున్నారు. అయితే ఈ ధరలు టాటా టియాగో అమ్మకాలపై ప్రభావం చూపుతుందా? లేదా? చూడాలి.

అలాగే టాటా టియాగో మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్ష్ ధరల్లోనూ తేడా ఉంటున్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్ ధర ఇప్పటి వరకు రూ. 6.85 లక్షలుగా ఉండేది. ఇక నుంచి రూ. 6.90 లక్షల తో విక్రయించనున్నారు. ఇదిలా ఉండగా టాటా టియాగో మాత్రమే కాకుండా టాటా కర్వ్ ధరలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారుకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఇలా ఆదరణ ఉన్న కార్ల ధరలు పెంచడంపై వినియోగదారులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.