పహల్గాం ఘటన జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మతాల గురించి పెద్ద చర్చ జరిగింది. చాలామంది వివిధ మతాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్టు సమాచారం.
కొంతమంది ప్రపంచంలో ఏది పెద్ద మతం అని కూడా సెర్చ్ చేశారు. చాలామందికి ప్రపంచంలో పెద్ద మతం గురించి తెలుసు. కానీ వరల్డ్ లోనే నాల్గవ అతిపెద్ద మతం గురించి మీకు తెలుసా? అయితే ఈ మతం ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన ప్రపంచం వివిధ మతాల సమ్మేళనం. ప్రాచీన కాలంలో అనేక మతాలు ఉండేవి. ఎన్నో రకాల మతాలతో ప్రపంచవ్యాప్తంగా మనుషులు జీవించేవారు. అయితే క్రైస్తవ, ఇస్లామిక్ మతాలు పుట్టుకొచ్చిన తర్వాత అనేక మతాలు కనుమరుగైనట్టు పుస్తకాల్లో చరిత్రలలో రాశారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువగా మతాలు ఉండేవి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 మతాల్లో హిందువు, ముస్లిమ్స్, సిక్కు, బౌద్ధులు, క్రైస్తవులు, యూదులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. అయితే ఈ మతాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ మతం కూడా ఉంది. ఆ మతం ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతాల్లో క్రైస్తవ మతం ఒకటి.. ప్రపంచ జనాభా నిష్పత్తిలో 31.6% క్రైస్తవ మత ఉంటుంది. ఆ తర్వాత 25.5% ముస్లిం జనాభా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత 15.1%తో హిందూ మతం మూడో స్థానంలో ఉంది. 14.4 శాతంతో ఏ మతం నాలుగవ స్థానంలో ఉందో మీకు తెలుసా?
14.4% ప్రపంచవ్యాప్తంగా ఏ మతం అనుసరించని వారు ఉన్నారని ఇటీవలే కొన్ని అధ్యయనాల్లో తేలింది. మతం నమ్మరివారు, ఎలాంటి మతం లేదని చెప్పుకునే వారు ప్రపంచవ్యాప్తంగా 14.4% ఉన్నట్లు సమాచారం. ఇక ఐదవ స్థానంలో బౌద్ధమతం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే స్పెయిన్‌తో పాటు ఇటలీ దేశాల్లో క్రైస్తవుల సంఖ్య పూర్తిగా తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా అమెరికా వంటి దేశాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో మతాన్ని కూడా విడిచిపెడుతున్నట్లు సమాచారం. దీంతో నాలుగవ స్థానంలో ఎలాంటి మతం ఆచరించని వారు ఉన్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.


































