హైబీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్నారా? అయితే అప్పుడప్పుడు ఎండుద్రాక్ష కూడా తింటూ ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది వాటిని నింయత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
దీనిని కిస్మిస్ అని కూడా పిలుస్తుంటారు. తియ్యగా, టేస్టీగానూ ఉంటుంది కాబట్టి తినడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతిరోజూ లేదా అప్పుడప్పుడు తిన్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆహార నిపుణులు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
*నిజానికి ఎండుద్రాక్షలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే రక్తపోటు, మధుమేహం కంట్రోల్‌లో ఉంటాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్‌గా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, డయేరియాను నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
*ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల గుండెకు హాని కలగకుండా రక్షిస్తాయి. కాల్షియం, పొటాషియం అధికంగా ఉండే కిస్మిస్ పాలలో కలిపి తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. కిస్మిస్‌లో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మ కణాల నష్టం నుంచి కాపాడతాయి. స్కిన్ ముడతలు రాకుండా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
*ఇన్ని ప్రయోజనాలున్న ఎండుద్రాక్షను ప్రతి రోజూ తీసుకున్నట్లైతే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్, ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. కాగా ప్రతి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం దృఢంగా తయారవుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది.అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
































