Gold Cleaning: బంగారు నగలు నల్లబడ్డాయా? ఇలా చేస్తే నగలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి

www.mannamweb.com


Gold Cleaning tips in telugu: బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అయితే పండగ వచ్చినా పేరంటం వచ్చినా తప్పనిసరిగా బంగారు నగలను ధరిస్తారు.
నగలను పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ధరించాక మిగిలిన సమయంలో వాటిని బీరువాలోనే పెడుతుంటాం.

ఈ నగలు కొన్ని రోజులకు నల్లగా, మురికిగా మారుతూ ఉంటాయి. నల్లగా మారిన నగలు కొత్తవాటిలా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. నగలను మెరిపించటానికి టూత్‌పేస్ట్‌ను వాడవచ్చు. అయితే తెల్లని టూత్‌పేస్ట్‌ను వాడాలి. నీటిలో టూత్‌పేస్ట్‌ను కలిపి నగలను పది నిమిషాలు ఉంచి రుద్దితే సరిపోతుంది.

నీటిలో బేకింగ్ సోడా కలిపి నగలకు రాసి రుద్ది రెండు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తరువాత, వైట్ వెనిగర్ సహాయంతో, నగలపై పేస్ట్ ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత నగలను శుభ్రమైన నీటితో ఒకసారి కడగాలి.
నగలు కొత్తవాటిలా మెరవటానికి డిష్ సోప్ ను కూడా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో డిష్ సోప్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నగలను వేసి ఒక నిమిషం అయ్యాక బ్రష్ సాయంతో రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత మృదువైన కాటన్ గుడ్డతో నగలను శుభ్రం చేస్తే సరిపోతుంది.

నగలను శుభ్రం చేయటానికి నిమ్మరసంను కూడా ఉపయోగించవచ్చు. ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని పోసి అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి నగలను వేసి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత నగలను మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసి, శుభ్రమైన నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.