మద్యం ప్రియులు తరచుగా మద్యం తాగడానికి ఇష్టపడతారు. పండుగ అయినా లేదా పార్టీ అయినా ఏ ప్రత్యేక సందర్భాలలో నైనా కచ్చితంగా మద్యం కావాల్సిందే.
దాంతో పాటుగా స్టఫ్ కూడా ఉండాలని కోరుకుంటారు. మద్యంతో పాటు స్టఫ్ లేకపోతే ఏ మాత్రం మజ ఉండదని భావిస్తారు. అయితే, స్టఫ్‌గా తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మద్యంతో తినకుండా ఉండాల్సినవి ఆహార పదార్ధలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆల్కహాల్‌తో చాక్లెట్ తినడం
కొంతమంది మద్యంతో కలిపి స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. ఆల్కహాల్‌తో పాటు చాక్లెట్ తింటే మత్తు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే చాక్లెట్‌లో ఉండే కెఫిన్ గ్యాస్ట్రిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, ఆల్కహాల్‌తో పాటు చాక్లెట్ తినే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.
కారం, ఉప్పగా ఉండే ఆహారాలు
తరచుగా ప్రజలు ఉప్పు లేదా కారంగా ఉండే పదార్థాలనుఆల్కహాల్‌తో తినడానికి ఇష్టపడతారు. కానీ, ఈ పదార్ధాలు మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తాయి.అంతేకాకుండా ఉప్పు, సుగంధ ద్రవ్యాలు మద్యం ప్రభావాన్ని మరింత పెంచుతాయి. దీని కారణంగా మత్తు త్వరగా వస్తుంది. కాబట్టి, మద్యంతో పాటు కారం,ఉప్పగా ఉండే పదార్థాలను నివారించాలి.
పిజ్జాతో మద్యం సేవించడం
పిజ్జాలో అధిక ఉప్పు, కొవ్వు ఉంటాయి. వీటిని ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్నప్పుడు శరీరం నిర్జలీకరణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. దీని కారణంగా, మత్తు త్వరగా సంభవిస్తుంది. అంతేకాకుండా వాంతులు అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఇందులో జున్ను, కొవ్వు పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఛాతీలో మంట కూడా రావచ్చు.
రెడ్ వైన్‌తో శనగలు
చాలా మంది రెడ్ వైన్‌తో శనగలు తినడానికి ఇష్టపడతారు. అయితే, ఇది చాలా ప్రమాదకరం.ఎందుకంటే రెడ్ వైన్‌లో టానిన్ అనే మూలకం ఉంటుంది.ఇది శనగ పప్పులలో ఉండే ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.
































